శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 26 డిశెంబరు 2017 (21:19 IST)

కళ్యాణ్‌ గారు ఎలా ఉన్నారు.. ఇద్దరు నేతల మధ్య ఆసక్తికర చర్చ..

ఒకరిద్దరు విఐపిలు కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విఐపిలందరూ ఒకేచోట చేరితే ఎలా ఉంటుంది. అది చూడడానికి రెండు కళ్ళు చాలవు. అలాంటి కార్యక్రమమే హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన సంధర్భంగా గవర్నర్ నరసింహన్ ప్రముఖలందరికీ ప్ర

ఒకరిద్దరు విఐపిలు కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విఐపిలందరూ ఒకేచోట చేరితే ఎలా ఉంటుంది. అది చూడడానికి రెండు కళ్ళు చాలవు. అలాంటి కార్యక్రమమే హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన సంధర్భంగా గవర్నర్ నరసింహన్ ప్రముఖలందరికీ ప్రత్యేక విందు ఇచ్చారు. విందు కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా ఈ విందుకు హాజరయ్యారు.
 
విందు ప్రారంభానికి ముందు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, పవన్ కళ్యాణ్‌‌ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కళ్యాణ్‌ గారు ఎలా ఉన్నారంటూ కెసిఆర్ పవన్ కళ్యాణ్‌‌తో కరచాలనం చేశారు. బాగున్నాను సర్ అంటూ పవన్ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఎలా ఉంది. పార్టీ.. ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారని విన్నాను. బాగుంది. మీ పర్యటలను చూస్తున్నానంటూ కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. కెసిఆర్, పవన్ కళ్యాణ్‌లు కలిసి మాట్లాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.