శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (09:12 IST)

2019 ఎన్నికల్లో పవన్ జనసేనకు అంత సీన్ లేదు.. చిరు పార్టీ ఏమైంది?: కేసీఆర్

2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపే అవకాశం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. సినీ స్టార్, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనపై కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీని నడపటం చిన్న విషయం కాదని చెప్పారు. గతంలో

2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపే అవకాశం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. సినీ స్టార్, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనపై కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీని నడపటం చిన్న విషయం కాదని చెప్పారు. గతంలో వెలుగులోకి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందేనని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవి భారం తగ్గినట్లుగా ఫీలయ్యాడని కేసీఆర్ గుర్తు చేశారు.
 
ఏపీలో వైసీపీకి 45 శాతం, టీడీపీకి 43 శాతం, బీజేపీకి 2 శాతం, పవన్‌కు 1.2 శాతం ఓట్లు వస్తాయని తన మిత్రుడొకరు తెలిపారని కేసీఆర్‌ చెప్పారు. ఏపీలో బీజేపీ పాగావేయాలనే ప్రయత్నంలో ఉందని, అందుకే కాపులకు ప్రాధాన్యత పెంచే ప్రయత్నంలో ఉందన్నారు.
 
ఇంకా ఏపీ రాజకీయాలపై కూడా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశం సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌‌లో కాపు సామాజిక వర్గం చాలా బలమైనదని చెప్పారు. అయితే శాఖలుగా, వర్గాలుగా కాపులు ఉండటంతో వారిలో ఐక్యత లేదని అభిప్రాయపడ్డారు. కాపులు ఏకమైతే పరిస్థితి వేరుగా ఉంటుందని ఆయన చెప్పారు. 
 
తెలుగు రాష్ట్రాలకు రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకొని ముందుకు సాగుతామని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు కూడా త్వరలోనే సమసిపోతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న దానికీ కొట్లాడుకోవడం వల్ల సమయం వృథానే తప్ప ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. 
 
సముద్రంలోకి వృథాగా వెళుతున్న గోదావరి నీటిని ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు తాను సూచించానని, గ్రావిటీ ద్వారానే కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీ వాడుకోవచ్చని, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదని వివరించారు.
 
తెలంగాణలో డ్రగ్స్‌ వ్యవహారాన్ని వదిలిపెట్టేదిలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని కేసీఆర్ అన్నారు. దక్షిణాదిన బలపడటం బీజేపీకి సాధ్యం కాదని కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కేంద్రం కేబినెట్‌లో చేరాల్సిన అవసరం మాకు లేదన్నారు. ఏపీ, తెలంగాణకు వేర్వేరు గవర్నర్లు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. ఏపీకి ఆనందిబెన్‌, తెలంగాణకు శంకరమూర్తి వచ్చే అవకాశం ఉందని అన్నారు.