1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (17:45 IST)

రాష్ట్ర విభజన బిల్లు : కేసీఆర్ దూకుడుపై చంద్రబాబు గుర్రు

రాష్ట్ర విభజన బిల్లులో పదో షెడ్యూల్‌లో చేర్చిన సంస్థల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దూకుడు ప్రదర్శించడంపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి కృష్ణారావు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.
 
వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్పు దగ్గరి నుంచి కెసిఆర్ అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైర్ అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను 9, 10 షెడ్యూళ్లలో చేర్చారు. 9వ షెడ్యూల్‌లో ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు మొత్తం 89 సంస్థలను చేర్చగా, 10వ షెడ్యూల్‌లో శిక్షణా సంస్థలు, అకాడమీలను, ఆ కోవలోకి వచ్చే 107 సంస్థలను చేర్చారు. 
 
అయితే వివాదం అంతా 10వ షెడ్యూల్‌లోని సంస్థలపైనే కేంద్రీకృతమైంది. ఈ షెడ్యూల్‌లోని సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాదన.