మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (14:40 IST)

బీజేపీతో పొత్తువల్ల తీవ్రంగా నష్టపోయా : టీడీపీ ఎంపీ కేశినేని నాని

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయానని, తనకు రావాల్సిన మెజార్టీ గణనీయంగా తగ్గిపోయిందని టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇదే అంశంపై ఆదివారం అ

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయానని, తనకు రావాల్సిన మెజార్టీ గణనీయంగా తగ్గిపోయిందని టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇదే అంశంపై ఆదివారం అర్బన్ కమిటీ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీతో పొత్తు వల్ల విజయవాడలో తీవ్రంగా నష్టపోయానని చెప్పారు. 
 
బీజేపీతో పొత్తు వల్ల విజయవాడ వెస్ట్‌లో తనకు 50 వేల ఓట్లు రాలేదని అన్నారు. బీజేపీ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందని అన్నారు. లేకపోతే తనకు లక్షా 30 వేల మెజారిటీ రావాల్సిందన్నారు. తాను కేవలం 70 వేల ఓట్ల మెజారిటీతో గెలవడానికి కారణం బీజేపీయేనని ఆయన అన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో తాను 3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానన్నారు.ఈ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. జగన్ ఢిల్లీలో ప్రధానిని కలిసిన అనంతరం బీజేపీ, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆరెండు పార్టీల మధ్య పొత్తు లేనట్టేనని వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది.