ఈ నెల 8న కియా కొత్త కారు ‘సెల్తోస్‌’ విడుదల... హాజరుకానున్న సీఎం

jagan
ఎం| Last Updated: మంగళవారం, 6 ఆగస్టు 2019 (06:34 IST)
అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో ఈనెల 8న మధ్యాçహ్నం కియా కంపెనీ తన కొత్తకారు ‘‘సెల్తోస్‌’’ను మార్కెట్లోకి విడుదలచేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి
వైయస్‌.జగన్‌ను కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి నివాసంలో కంపెనీ ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేవ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ ముఖ్యమంత్రిని కలిసి కొత్తకారు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఏడాదికి 3 లక్షల కార్లను అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటుద్వారా ఉత్పత్తిచేయగలమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. ప్రస్తుతం టర్కీ, స్లొవేకియాలకు ఇంజిన్లనుకూడా ఎగుమతి చేస్తామన్నారు. కియా కొత్తకారు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ హాజరవుతున్నారు.
దీనిపై మరింత చదవండి :