సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (13:00 IST)

జగన్‌పై చర్యలకు డిమాండ్ చేస్తే 'సొము'కెందుకు కోపం? అచ్చెన్న

atchennaidu
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై కేంద్రం చర్యలు తీసుకోవాలంటే ఎందుకంత కోపం, అసహనం ప్రదర్శించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో దారుణాలు, నేరాలు, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ఆందోళన వ్యక్తం చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. రాష్ట్రాల్లో పాలన గాడి తప్పినప్పుడు, అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు ఆర్టికల్‌ 355 ప్రకారం కలగజేసుకొనే అధికారం కేంద్రానికి ఉందన్న విషయాన్ని వీర్రాజు తెలుసుకోవాలని అచ్చెన్న అన్నారు. 'వైకాపా మూకల విధ్వంసంపై పోరాడాల్సిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం దారుణం' అని అచ్చెన్నాయుడు అన్నారు.