మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 డిశెంబరు 2020 (13:37 IST)

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కి ప్యాకేజీ అందింది: మంత్రి నాని వ్యాఖ్యలు

తనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. తానేదో వకీల్ సాబ్ అని అనుకుంటుంటే జనం మరోలా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి రావాలని ఎవరూ కోరుకోలేదనీ, తనకు తానే సినిమాలు చేయనని గతంలో చెప్పారని అన్నారు.
 
 చంద్రబాబు సొంత పుత్రుడు నారా లోకేష్ ఒకవైపు, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు ప్రచారాలు చేస్తున్నారంటూ సెటైర్లు విసిరారు. ఈ దత్తపుత్రుడుకి ప్యాకేజీ అందటంతో తన పర్యటనలు మరింత ఉధృతం చేశారంటూ విమర్శించారు.
 
కాగా నిన్న మచిలీపట్నం పర్యటనలో పవన్ కళ్యాణ్ వైకాపా నాయకులపై మండిపడ్డారు. తను కష్టపడి పని చేస్తున్నాననీ, వైకాపా నాయకుల్లా తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, మైనింగ్, మీడియా సంస్థలు లేవన్నారు. వాళ్లు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయగా లేనిది నేను సినిమాల్లో కష్టపడి పనిచేస్తూ రాజకీయాలు చేయకూడదా అంటూ ప్రశ్నించారు.