సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (10:06 IST)

కరోనా మరణాల్లో కృష్ణా జిల్లా టాప్

కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరగడమే కాకుండా జిల్లాలో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది.  వైరస్ వ‌ల్ల జిల్లాలో గత ఐదు రోజుల్లో ప‌ది మంది ప్రాణాలు కోల్పోయారు.

కొత్తగా వచ్చిన కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1063కి చేరింది. వీరిలో 463 మంది వ్యాధి నయ‌మై డిశ్ఛార్జి అయ్యారు. మొత్తం 37 మంది ఇప్పటివరకూ వైరస్ బారినపడి మృతి చెందారు.

కరోనా మరణాల్లో రాష్ట్రంలోనే  కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉన్నది.  విజ‌య‌వాడ నగరంలో కేసులు సంఖ్య భారీగా పెరుగుతున్నది. అత్య‌ధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా ఉంది.