మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (14:30 IST)

ప్రియురాలు చికెన్ పకోడి తినలేదనీ ప్రియుడు ఆత్మహత్య

తాను ఎంతో ఇష్టంగా తెచ్చిన ప్రియురాలు చికెన్ పకోడి తినక పోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుడివాడ, ధనియాల పేటకు చెందిన తెర్లి శ్రీను (25) అదే ప్రాంతానికి చెందిన వివాహితతో కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీను, ఆమె ఈనెల 19న మచిలీపట్నం వెళ్లివచ్చారు. అక్కడి నుంచి వస్తూ శ్రీను మద్యం, కోడిపకోడి తెచ్చుకున్నాడు. 
 
ఆ రోజు రాత్రిపూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు. దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆమె తన పాపను స్కూలు వద్ద దించి వచ్చే సమయానికి శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.