సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 జులై 2017 (12:25 IST)

దిగ్విజయ్‌కు బుద్ధి మందగించింది... విచక్షణ కోల్పోయారు: కేటీఆర్

తెలంగాణపై విషం చిమ్మిన కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌పై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. దిగ్విజయ్... విచక్షణ కోల్పోయారు. బుద్ధి మందగించింది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశా

తెలంగాణపై విషం చిమ్మిన కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌పై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. దిగ్విజయ్... విచక్షణ కోల్పోయారు. బుద్ధి మందగించింది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అందువల్ల ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వయస్సుకు తగ్గట్లుగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇప్పటికైనా తెలంగాణ పదం సరిగా రాయడం నేర్చుకోవడం సంతోషమంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 
 
అంతకుముందు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేస్తూ తెలంగాణలో భారీ డ్రగ్స్ కుంభకోణం బయటపడింది. ప్రభావితం చేయగల టీఆర్‌ఎస్ నేతల మిత్రుల పాత్ర ఉంది. నిందితులను రక్షిస్తారా?.. విచారిస్తారా? అంటూ తన ట్విట్టర్ ఖాతాలో దిగ్విజయ్‌ సింగ్ ట్వీట్ చేయగా, దీనికి కేటీఆర్ పై విధంగా ట్వీట్ చేశారు. 
 
దిగ్విజయ్ సింగ్ పూర్తిగా గతి తప్పారని వ్యాఖ్యానించిన ఆయన, గౌరవప్రదంగా ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. దిగ్విజయ్ సింగ్ తన వయసుకు తగ్గ పనులు చేసుకోవాలని సూచించిన కేటీఆర్, ఎట్టకేలకు 'తెలంగాణ' స్పెల్లింగ్‌ను ఆయన నేర్చుకున్నారని, అందుకు సంతోషమని సెటైర్ వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.