శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (21:42 IST)

అమేజాన్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.10లక్షల ఆస్తి నష్టం

దీపావళి సందర్భంగా విజయవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన జరిగిన కొన్ని గంటల్లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లాలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్‌కు చెందిన గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం ఏర్పడింది. ఈ అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు గోడౌన్ సిబ్బంది తెలిపారు. 
 
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.