Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అదృష్టమో... దురదృష్టమో ఆ మంత్రి నారా లోకేష్... బుట్టా రేణుక

ఆదివారం, 16 జులై 2017 (12:34 IST)

Widgets Magazine

ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో ఉన్న నారా లోకేశ్‌ను అభివృద్ధి పనుల విషయంగానే తాను కలిశానే తప్ప, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలూ లేవని వైకాపా ఎంపీ బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన ఎంతమాత్రమూ లేదని స్పష్టంచేశారు.
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ 'నా నియోజకవర్గంలో రూ.66 కోట్ల మంచినీటి పథకం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని తక్షణమే పూర్తి చేయాలని సీఎంను కలిసి కోరాలనుకున్నాను. కానీ... అప్పాయింట్‌మెంట్‌ లభించలేదు. జిల్లా పర్యటకు వచ్చిన మంత్రికి కలిసి వినతిపత్రం ఇచ్చాను. అదృష్టమో... దురదృష్టమో ఆశాఖ మంత్రిగా సీఎం తనయుడు లోకేశ్‌ ఉన్నారు. ఆయనను నేను రహస్యంగా కలవలేదు. నియోజకవర్గ నాయకులందరి సమక్షంలోనే కలిశా' అంటూ వివరణ ఇచ్చారు. 
 
నారా లోకేష్‌‍తో బుట్టా రేణుక భేటీ అయ్యారు. దీనిపై వైకాపా నేతలతో పాటు ఆ పార్టీ అధినేత జగన్ మండిపడ్డారు. ముఖ్యంగా, ఒకవైపు నంద్యాల ఉప ఎన్నికలు సమీపిస్తున్నాయి. అదే సమయంలో ఎంపీ బుట్టా రేణుక మంత్రి లోకేశ్‌ను కలవడం ఏమిటి? పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రాకుండా లోకేశ్‌ను కలిస్తే బయట ఏమని ప్రచారం జరుగుతుంది? దీనివల్ల రాజకీయంగా నష్టం వాటిల్లుతుంది అంటూ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 
ఈ విమర్శలకు ఆమె తనదైనశైలిలో స్పందించారు. అభివృద్ధి పనుల విషయంగా మంత్రి నారా లోకేష్‌ను కలిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలూ లేవన్నారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేసిన ఆమె, పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రాలేకపోతున్నట్టు ముందుగానే సమాచారం ఇచ్చానని స్పష్టంచేశారు. 
 
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈనెల 13న జరుగుతుందని తొలుత ప్రకటించారు. దానిని శనివారం సాయంత్రం జరుగుతుందన్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకే జరుగుతుందంటూ ఓ గంట ముందు తెలిపారు. నెల కిందటే నిర్ణయించుకున్న కార్యక్రమం.. పార్టీలో 2000 మంది చేరుతుండటంతో భేటీకి రాలేనని చెప్పాను. అయినా నాపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కథనాలు రావడమేమిటి? అని రేణుక ప్రశ్నించారు. మరోవైపు... సమస్యల పరిష్కారం కోసం మంత్రులను కలిస్తే తప్పేంటని వైసీపీ ఎంపీ మేకపాటి ప్రశ్నించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

174 మంది ప్రాణాలు తీయబోయిన పక్షి.. ఎలా?

ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి ...

news

గోవును చంపితే 14 యేళ్ళు.. మనిషిని చంపితే రెండేళ్లు : న్యాయ వ్యవస్థలో లోపాలు

దేశ న్యాయవ్యవస్థలోని లోపాలను పలువురు న్యాయకోవిదులు ఎత్తిచూపుతున్నారు. ఎందుకంటే.. గోవును ...

news

దావూద్ గ్యాంగ్‌‌తో అబు అజ్మీకి లింకులు : అమర్ సింగ్

సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీకి అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలు ...

news

బుల్లి 'మగధీర' మరి లేడు... కామెర్ల వ్యాధితో కన్నుమూశాడు...

తెలంగాణ నేలపై, పొలాల్లో బాగా జుట్టు పెంచుకుని చిన్న బుడతడు ఒకడు మగధీర చిత్రం డైలాగులు ...

Widgets Magazine