గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (15:08 IST)

‘రాజా ఆఫ్ కరప్షన్’పై బహిరంగ చర్చకు సిద్ధమా...?: ఉండవల్లికి కుటుంబరావు సవాల్

అమరావతి : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈర్ష్యతో అమరావతి బాండ్ల అమ్మకంపైనా, సీఎం చంద్రబాబునాయుడుపైనా హేళనగా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. 2009లో టీడీపీ ప్రచురించిన రాజా ఆఫ్ కరప్షన్ బహిరంగ చర్చకు రావాల

అమరావతి : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈర్ష్యతో అమరావతి బాండ్ల అమ్మకంపైనా, సీఎం చంద్రబాబునాయుడుపైనా హేళనగా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. 2009లో టీడీపీ ప్రచురించిన రాజా ఆఫ్ కరప్షన్ బహిరంగ చర్చకు రావాలని ఉండవల్లి అరుణ్ కుమార్‌కు ఆయన సవాల్ విసిరారు. అమరావతి ట్యాక్స్ ఫ్రీ బాండ్లు కాదని స్పష్టం చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. వడ్డీ ఎక్కువ ఇస్తున్నామంటున్నారు. అది సరికాదన్నారు. 
 
సీఆర్డీయే దేశంలో మంచి ఇమేజ్ సంపాదించుకుందన్నారు. రూ.2 వేల కోట్ల అమరావతి బాండ్లు ఇష్యూ అయిన తరువాత చాలా మందికి ఈర్ష్య, ద్వేషాలు పెరిగాయన్నారు. ఆ కారణంతోనే అమరావతి బాండ్లపైనా, సీం చంద్రబాబునాయుడుపైనా విమర్శలు చేస్తున్నారని ఉండవల్లిని ఉద్దేశించి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు మండిపడ్డారు. తాము ఇచ్చిన వడ్డీ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటుకు ఎవరూ తెచ్చినా ఎరెంజ్డ్ ఫీజు ఫ్రీగా ఇస్తామన్నారు. తాము రూ.2 లక్షల కోట్లు అప్పుచేశామని ఉండవల్లి ఆరోపిస్తున్నారన్నారు. 
 
ఉన్న అప్పుల కోసం 75శాతం వడ్డీలు చెల్లించేందుకు అప్పు పెరిగిందన్నారు. ప్రజలకు ఆర్థిక అంశాల మీదా అవగాహన ఉండదని అబద్దాలతో ప్రజలను పక్కదోవా పట్టించాలి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సెబీ కిందా గుర్తింపు పొందిన సంస్థలు బిడ్డింగ్‌లో కోడ్ చేశాయన్నారు. బిడ్డింగ్ పారదర్శకంగా నిర్వహించామన్నారు. యూసీలు ఏవిధంగా ఇస్తారో..? ఎంపిగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌కు తెలియనిది కాదన్నారు. నీతి అయోగ్ కూడా తామిచ్చిన యూసీలను ధ్రువీకరించాయన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. 
 
కేంద్రం సహకరించకపోవడంతో, పనులు ఆగకూడదనే ఉద్దేశంతోనే అమరావతి బాండ్లను విక్రయానికి పెట్టామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి 10 అవార్డులు వచ్చాయన్నారు. పారదర్శకతకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమి కావాలన్నారు. చిల్లర మాటలు సరికాదన్నారు. 2009లో టీడీపీ ప్రచురించిన రాజా ఆఫ్ కరప్షన్ బహిరంగ చర్చకు రావాలని ఉండవల్లి అరుణ్ కుమార్‌కు ఆయన సవాల్ విసిరారు. మీడియా సమక్షంలో చర్చలు జరుపుదామన్నారు. 2004లో స్విట్జర్లాండ్ మంత్రి సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శించారని ఉండవల్లి చెప్పారన్నారు. 
 
ఆనాడు సీఎం చంద్రబాబునాయుడు విజన్ 2020తో మాట్లాడారన్నారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.లక్షా 9 వేల కోట్లు జి.ఎస్.డి.పి.గా ఉందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల జి.ఎస్.డి.పి. రూ.13.6 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ఆనాడు సీఎం చంద్రబాబునాయుడు ఏడు రెట్లు పెంచుదామని అంటే, నేడు జి.ఎస్.డి.పి. 14 రెట్లు పెరిగిందన్నారు. ఇది చంద్రబాబునాయుడు విజన్‌కు నిదర్శనమన్నారు. దీన్ని కూడా విమర్శిస్తూ ఉండవల్లి హేళనగా మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. మరో రెండు మూడేళ్లలో సీఆర్డీయే ఆదాయం విపరీతంగా పెరుగుతుందన్నారు. ఈ విషయం గుర్తించే ఇన్వెస్టర్లు అమరావతి బాండ్ల కొనుగోలుకు ఆసక్తి చూపారన్నారు.