శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (15:31 IST)

లడ్డూ వివాదం.. స్వరూపానంద స్వామి ఎక్కడికెళ్లారో... మౌనం ఎందుకు?

స్వరూపానంద స్వామి గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండేవారు. హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు స్వామి స్వరూపానంద సరస్వతి సహాయం తీసుకున్నారు. హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు ఆలయ యాత్రలు కూడా చేశారు. 
 
ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామి జగన్‌కు బలమైన మద్దతుదారుగా ఉండేవారు. అప్పటి చంద్రబాబు నాయుడుపై రాజకీయ విమర్శల కోసం ఆశ్రయించేవారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రతి విషయంలో స్వామి సలహాలు తీసుకునేవారు.
 
అయితే ప్రస్తుతం జరుగుతున్న తిరుమల లడ్డూ వివాదంపై స్వరూపానంద స్వామి మౌనం వహించారు. తిరుమల లడ్డూ వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా, జాతీయ మీడియా కూడా ఈ అంశంపై స్పందించింది. 
 
అయితే స్వామి వారు మాత్రం నోరు మెదపట్లేదు. స్వరూపానందకు ఎకరం లక్ష రూపాయలతో 15 కోట్ల భూమిని జగన్ బహుమతిగా ఇవ్వడం కూడా చేశారు. ఆ తర్వాత స్వామి వారి ఆశ్రమం భద్రత కోసం అప్పటి ప్రభుత్వం 20 లక్షల రూపాయలు వెచ్చించింది.