బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (19:28 IST)

భర్త, పిల్లలు లేని సమయంలో మహిళా డాన్సర్ ఇంట్లోకి వచ్చింది, వెళ్లగానే సూసైడ్

విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ డాన్సర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... గాయత్రి అనే డాన్సర్ తన భర్త సతీష్, పిల్లలతో కలిసి వాంబే కాలనీలో వుంటోంది. ఆమె ఇంట్లో వుండగా భర్త, పిల్లలు బైటకు వెళ్లారు. ఆ సమయంలో నీలిమ అనే ఓ యువతి గాయత్రి ఇంటికి వచ్చింది.
 
వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ఇరుగుపొరుగు చెపుతున్నారు. అనంతరం నీలిమ వెళ్లిపోయింది. కొద్దిసేపటికే గాయత్రి ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేశారు.