ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (11:57 IST)

నంద్యాలలో టీడీపీ గెలుస్తుంది కానీ.. లగడపాటి సర్వే ఏం చెపుతుంది...

ముందస్తుగా ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించడంలో 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ప

ముందస్తుగా ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించడంలో 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల పోలింగ్‌పై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
ఈ ఎన్నికల్లో విజయం టీడీపీదేనని లగడపాటి జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రం పోలింగ్‌ ముగిశాక.. ఓటింగ్‌ సరళిపై ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం పెరిగిందని, అందువల్ల ఫలితంలో మార్పు వస్తుందన్నారు. 
 
పోలింగ్‌ శాతం పెరిగినందున టీడీపీ 10శాతం ఓట్ల మెజారిటీని సాధిస్తుందన్నారు. నంద్యాలలో 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చని.. ఇది 15 వేలైనా కావొచ్చు.. 20 వేలకైనా రావొచ్చని తెలిపారు. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెల్సిందే.