Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి గెలుపు ఖాయమట... లగడపాటి

శుక్రవారం, 7 జులై 2017 (12:13 IST)

Widgets Magazine
lagadapati

లగడపాటి రాజగోపాల్. ఎక్కడ ఎన్నికలు జరిగినా వెంటనే ఒక సర్వే చేసి ఫలితాలను ముందే చెప్పేస్తుంటారు. గతంలో కూడా ప్రధాన ఎన్నికలపై సర్వే నిర్వహించిన లగడపాటి కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది, తెలుగుదేశంపార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పాడు. అంతేకాదు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపిల సీట్లపై కూడా స్పష్టమైన సంఖ్యను కూడా ఇచ్చారు. 
 
లగడపాటి సర్వేలో వచ్చినట్లుగానే అటుఇటు రెండుమూడు సీట్లు తప్ప టిడిపి అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తరువాత లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకోవడం, ఆ తరువాత ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడకపోవడం జరిగిపోయాయి.
 
కానీ తాజాగా తన స్నేహితులతో నంద్యాల ఉప ఎన్నికలపై సర్వే చేశారట లగడపాటి. ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని తేల్చేశారట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల ద్వారా అందరికీ సమాచారం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా సర్వే చేయించిన లగడపాటి ఈ నిర్ణయాన్ని ప్రకటించారట. లగడపాటి సర్వేతో టిడిపి ఆలోచనలో పడింది. 
 
ఎలాగైనా ఆ సీటును కైవసం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే శిల్పామోహన్ రెడ్డి వైసిపిలోకి వెళ్ళిపోయి తన వారందరినీ లాక్కుని పక్కా వ్యూహంతో ముందుకెళుతున్న తరుణంలో అధికారపార్టీకి పెద్ద తలనొప్పే వచ్చి పడింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొత్త జంటలకు సీఎం యోగి నయా గిఫ్ట్.. తెరిచి చూస్తే షాక్... కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు...

కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వినూత్న ...

news

శిరీష లోదుస్తులపై వీర్యపు మరకలు లేవు: ఫోరెన్సిక్ రిపోర్టు

బ్యూటీషియన్ శిరీష లోదుస్తులపై ఎలాంటి మరకలు లేవని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. ...

news

తెలంగాణాలో కేసీఆర్‌ను ముప్పు తిప్పలు పెడుతున్న మహిళ ఎవరు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఓ మహిళ ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల ...

news

ముంబైలో నిర్భయ ఘటన... కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అచ్చం ఢిల్లీ నిర్భయ ఘటన ...

Widgets Magazine