శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (12:17 IST)

చంద్రబాబును ఎన్టీఆర్ అండమాన్ జైలుకు పంపాలనేవారు.. లక్ష్మీపార్వతి

వైసీపీ నేత లక్ష్మీ పార్వతి టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఎన్టీఆర్ బ్రతికున్న రోజుల్లో చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారో లక్ష్మీ పార్వతి ప్రస్తావించారు.

మాజీ సీఎం ఎన్టీఆర్‌ చనిపోయిన రోజుల్లో చంద్రబాబు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసేవారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే.. చంద్రబాబును తప్పకుండా అండమాన్‌ జైలుకు పంపించాలని ఉందని తనతో అన్నట్లు లక్ష్మీ పార్వతి గుర్తు చేసుకున్నారు.
 
చంద్రబాబుకు ప్రస్తుతం అదే గతి వస్తుందని ఆశిస్తున్నట్లు లక్ష్మీపార్వతి అన్నారు. ఏపీలో గత పాలనపై ఏర్పాటు చేసిన సిట్ ద్వారా వాస్తవాలన్నీ బయటకు వస్తాయని, త్వరలోనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా ముగ్గరూ జైలుకెళ్లడం తాను కళ్లారా చూస్తానని ఆమె ఆరోపించారు. 
 
ఇకపోతే.. తెలుగు భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్య పీఠాన్ని విశ్వ విద్యాలయంగా మార్చి అభివృద్ధి చేస్తామన్నారు.

అలాగే తెలుగు భాషతో పాటు, ఇంగ్లీషు కూడా సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. తెలుగు భాష అమ్మే.. కానీ.. అప్పుడప్పుడు కొన్ని మెళుకువలు పాటించాలని ఆమె సూచించారు.