మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (19:03 IST)

అధికారం కోసం బాబు దేన్నయినా పట్టుకుంటారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎపి సిఎం చంద్రబాబు నాయుడుపై చాలా రోజుల తరువాత లక్ష్మీపార్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి, రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమేనని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ము

ఎపి సిఎం చంద్రబాబు నాయుడుపై చాలా రోజుల తరువాత లక్ష్మీపార్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి, రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమేనని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ముఖ్యం. దాని కోసం ఏమైనా చేస్తాడు... ఎంతకైనా తెగిస్తాడు.. అధికారం కోసం ఎవరి కాళ్ళయినా, చేతులైనా, ఇంకేమైనా పట్టుకోవడానికి బాబు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారంటూ వ్యాఖ్యానించారు.
 
నేను కూడా రాజకీయాలను చూశాను. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని మాత్రం ఇప్పటివరకు చూడలేదు. ఇకముందు చూడను కూడా ఏమో. అబద్థాలు, మోసం చేయడం ఇదంతా బాబుకు బాగా తెలుసు. బాబు మోసాలను జనం ప్రత్యక్షంగా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బాబుకు ప్రజలు సరైన జవాబు చెబుతారంటూ లక్ష్మీపార్వతి విమర్శించారు. చాలా రోజుల తరువాత ఉన్నట్లుండి చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.