శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 30 సెప్టెంబరు 2021 (17:27 IST)

చిత్తూరులో గల్లా కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు గల్లా రామచంద్రనాయుడుతో సహా 12 మందిపై భూ ఆక్ర‌మ‌ణ‌ కేసు నమోదు అయింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి  కోర్టులో ప్రైవేటు కేసు వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
దిగువ భాగానికి చెందిన రైతు గోపి కృష్ణకు చెందిన పొలాన్నిగల్లా కుటుంబం రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడిందంటూ రైతు కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన చిత్తూరు నాలుగో అదనపు కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పలు సెక్షన్ల కింద చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.