గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (07:42 IST)

తిరుమల బై పాస్ లో లేజర్ షో

స్మార్ట్ సిటీలో భాగంగా తిరుమల బై పాస్ రోడ్డు లోని ప్రకాశం పార్కులో ఏర్పాటు చేసిన లేజర్ షో ట్రయిల్ రన్ ను నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా సోమవారం రాత్రి పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు బాగున్నాయని ,  చిన్న చిన్న పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్లే కోర్టులో లైటింగ్ పరిశీలించి క్రీడాకారులకు అనువుగా ఉండేలా లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. సెల్ఫీ పాయింట్స్ త్వరగా అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. వాకింగ్ ట్రాక్ లో మట్టి బాగా వేసి వాకర్స్ కు ఇబ్బంది లేకుండా రోల్ చేయించాలన్నారు. సెల్ఫీ పాయింట్స్ ను స్వయంగా సెల్ఫీ తీసి పరిశీలించి, చిన్న మార్పులను సూచించారు.

పూల మొక్కలు మరిన్ని నాటాలన్నారు. గ్రీనరీ కూడా పెంచాలని, వాటర్ పాండ్ లో నీరు నింపాలన్నారు. లేజర్ షో బాగుందని,  అన్ని వయసు ల వారికి నచ్చే పాటలు సెట్ చేయాలని సూచించారు. ఆంఫి థియేటర్ చుట్టూ ఏపుగా పెరిగే మొక్కలు నాటాలన్నారు. అంతా చాలా  బాగానే ఉందని చిన్న చిన్న పనులు రెండు రోజుల్లో పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.