సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (20:44 IST)

హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్-స్టాప్ విమాన సర్వీసు ప్రారంభం

తెల్లవారుజామున 01.00 గంటలకు ఎయిర్ ఇండియా - AI-108 నాన్-స్టాప్ విమానం 237 ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగా, విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులను, ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందికి ఆహ్వానం పలికారు.

అదే విమానం - ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777 ఎల్ఆర్- ఫ్లైట్ నెం. AI 107 నేడు సుమారు 12.50 గంటలకు హైదరాబాద్ నుండి చికాగోకు  226 ప్రయాణీకులు, 16 మంది సిబ్బందితో చికాగోకు బయలుదేరి వెళ్లింది.
 
విమానం ద్వారా చికాగో వెళ్లే ప్రయాణికులు, సిబ్బందికి వీడ్కోలు పలకడానికి హైదరాబాద్ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, ఎయిర్ ఇండియా సిబ్బంది టెర్మినల్ వద్ద బారులు తీరారు. చికాగో నుంచి వచ్చిన ప్రయాణికులకు కూడా ఇదే విధమైన స్వాగతం లభించింది.