తిరుమల ఘాట్ రోడ్డు ప్రహరీ గోడపై చిరుతపులి పరుగులు (video)
తిరుమల ఘాట్ రోడ్డు ప్రహరీ గోడపై చిరుతపులి పరుగులు పెడుతూ కనిపించింది. చిరుతపులి ఇలా రోడ్డు పైనే సంచరిస్తుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భక్తులలో భయాన్ని పెంచుతున్నాయి. రెండు వారాల క్రితం కూడా చిరుతలు ఈ ప్రాంతంలో సంచరించాయని పలువురు భక్తులు తెలియజేసారు. ముఖ్యంగా అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు చిరుత సంచారంతో భయపడుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు భక్తుల ఆందోళన దృష్ట్యా భద్రతా చర్యలను వెంటనే ప్రారంభించారు. జూ పార్క్ రోడ్ నుండి తిరుమల టోల్ గేట్ వైపు అటవీ ప్రాంతం ద్వారా చిరుతపులి వెళుతున్నట్లు కనిపించింది. చిరుతపులి కదలికలను గమనించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ సెల్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.