గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ప్రారంభమైన ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

evm vote
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 23వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మొదలైంది. నెల్లూరు పాలెంలోని ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 14 కౌంటింగ్ టేబుళ్లు, 20 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. 
 
కాగా ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తాజాగా ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. గతంలో 83.32 శాతం ఓటింగ్ నమోదవగా.. ఈసారి 64.14 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 2,13,338 ఓట్లు ఉండగా, 1,37,081 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పోస్టల్‌ ఓట్లు 493 ఉన్నాయి.
 
మరోవైపు, ఆత్మకూరుతోపాటు దేశవ్యాప్తంగా మూడు లోక్‌సభ, మరో ఆరు అసెంబ్లీ స్థానాలకు నేడు ఫలితాలు వెలుడనున్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌, అజంఘఢ్‌, పంజాబ్‌లోని సంగ్రూర్‌ లోక్‌సభ స్థానాలు, ఏపీలోని ఆత్మకూరు, త్రిపురలోని అగర్తలా, జుబరాజ్‌నగర్‌, సుర్మా, బర్డౌలి, ఢిల్లీలోని రజీందర్‌ నగర్‌, జార్ఖండ్‌లోని మందార్ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23న ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.