గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (08:57 IST)

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

rain
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం గురువారానికి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 22వ తేదీ ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత మరింతగా బలపడి తుఫానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ముఖ్యంగా, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర తీరంలో గురువారం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 21, 22 తేదీల్లో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. అందువల్ల జాలర్లరు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.