శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (09:32 IST)

చిత్తూరులో మరో మదనపల్లి ఘటన : దేవుడి వద్దకు వెళుతున్నాననీ...

మదనపల్లిలో మూఢనమ్మకం ఇద్దరు ఆడపిల్లలను కన్నతల్లిదండ్రులే హత్య చేశారు. ఈ ఇద్దరు మృతులు అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్లు. తమ కుమార్తెలు దేవుడి వద్దకు వెళ్లారనీ, వారు మళ్లీ తిరిగి వస్తారని ఆ దంపతులు చెబుతున్నారు. పైగా, తాను దేవుడినని తనకు కరోనా పరీక్షలు ఎందుకు అంటూ ఆ కుమార్తెలను తల్లి చెబుతోంది. ఈ జంట హత్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఈ ఘటన మరచిపోకముందే.. చిత్తూరు జిల్లా ఇలాంటి ఘటనే ఒకటి ఇదే జిల్లాలో మరొకటి వెలుగు చూసింది. 
 
జిల్లాలోని గంగవరం మండలానికి చెందిన గణేశ్ అనే యువకుడు డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. తాను దేవుడి వద్దకు వెళుతున్నానంటూ లేఖ రాసి కనిపించకుండా పోయాడు. ఈ నెల 21 నుంచి అతడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. మదనపల్లె ఘటన నేపథ్యంలో తమ బిడ్డకు ఏమీ జరగకూడదని వారు ప్రార్థిస్తున్నారు.
 
కాగా, అదృశ్యమైన యువకుడికి భక్తి భావాలు మెండుగానే ఉన్నా, మరీ మూఢత్వం స్థాయిలో లేవని బంధువులు చెబుతున్నారు. కానీ, మదనపల్లె ఘటనను దృష్టిలో ఉంచుకుని వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.