శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (17:54 IST)

చనిపోయాడని పాడెపై మోసుకెళ్తుంటే.. లేచి కూర్చున్నాడు..

మరణించిన వ్యక్తులు శ్మశానాల్లో లేవడం.. వాళ్లకు ఊపిరి రావడం వంటి సంఘటన గురించి వినే వుంటాం. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరులో చోటుచేసుకుంది.  చనిపోయాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి కూర్చుని అందరికీ షాకిచ్చాడు. ఈ ఘటన చితూర్తు జిల్లాలోని మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఓ వ్యక్తి మండలంలోని కట్టుబావి గ్రామంలో చెట్టు కింద రెండు రోజులుగా అపాస్మారక స్థితిలో పడి ఉన్నాడు.
 
ఈ విషయాన్ని గ్రామస్తులు గ్రామకార్యదర్శి మనోహర్‌, వీఆర్వో నాగరాజుకు తెలిపారు. వీరు అక్కడికి చేరుకుని చనిపోయాడని భావించారు. దీంతో ఊరికి సమీపంలో గుంతను తవ్వించి, పాడెపై మోసుకెళ్తున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒక్కసారిగా పాడెపై ఉన్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. దీంతో అవాక్కయిన స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించారు. అయితే.. ఆ వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు.