ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:23 IST)

వాళ్లిద్దరూ స్నేహితులు.. షటిల్ ఆడుతూ.. కత్తితో దాడి చేసి..?

షటిల్ ఆట కాస్త వివాదానికి దారి తీసింది. స్నేహితుల మధ్య దాడికి కారణమైంది. చివరికి ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కోళ్లమిట్ట సెంటర్‌లో రాత్రి 10గంటలకు షటిల్ ఆడుతున్నసమయంలో చోటుచేసుకొన్న ఓ వివాదం హింసగా మారింది. 
 
ఓ యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఓ పది మంది వ్యక్తులు షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో అనిల్ కుమార్, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులతో పవన్, సాయి అనే యువకులు ఘర్షణకు దిగారు.
 
దూషణల క్రమంలో హఠాత్తుగా సమీపంలోని ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన కత్తితో అనిల్ కుమార్ అనే యువకుడిపై విచక్షణ రహితంగా దాడిచేసి చంపేశారు. మరో యువకుడు మణికంఠకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సమీప హాస్పిటల్‌కు తరలించారు.