సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2019 (15:57 IST)

ఇళ్లలో దూరి యువకుడు చేస్తున్న పనిచూస్తే..?

ఇళ్లలోకి దూరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నందుకు గానూ స్థానికులు ఓ యువకుడికి దేహశుద్ధి చేసారు. హైదరాబాద్ సనత్ నగర్‌లోని జింకల వాడకు చెందిన అంజి తన విపరీత ప్రవర్తనతో అక్కడి మహిళలను వేధిస్తూ వస్తున్నాడు. ఇళ్లలోకి ప్రవేశించి మరీ మహిళలతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడు. అంతేకాకుండా చిన్నపిల్లలను సైతం లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. 
 
దీంతో విసుగు చెందిన స్థానికులు కోపంతో అంజిని కరెంట్ స్థంభానికి కట్టేసి చితకబాదారు. చొక్కా విప్పి మరీ ఆడవారు బాగా దేహశుద్ధి చేసారు. మరోసారి ఇలాంటి ప్రవర్తనతో తమను ఇబ్బంది పెడితే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోమని స్థానిక మహిళలు చెప్పారు. అంజికి దేహశుద్ధి చేసిన అనంతరం స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.