శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (17:50 IST)

ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై.. అత్యాచారయత్నం.. తల్లి రావడంతో?

నేరాలలో హైదరాబాద్‌కి ధీటుగా ఏదీ పోటీపడదనిపిస్తోంది. భాగ్య నగరంలో జరిగే దారుణాలు అన్నీ ఇన్నీ కావు. రోజుకు ఒక క్రైమ్ న్యూస్ అయినా అక్కడ నుండి వస్తోంది. కొన్నిరోజుల క్రితం లోయర్ టాంక్ బండ్ సమీపంలో గంజాయి మత్తులో ఓ వ్యక్తి మైనర్ బాలికపై చేసిన దారుణచర్యను మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది. 
 
హైటెక్ సిటీ సైబర్ టవర్స్‌కు సమీపంలో ఉన్న మాదాపూర్ పర్వతనగర్ ఏరియాలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. సమయానికి అక్కడికి తల్లి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ జంట తమ ఎనిమిదేళ్ల కూతురితో కలిసి మాదాపూర్ పర్వతనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పాప ఆడుకుంటూ పైన ఉన్న యజమాని ఇంటికి వెళ్లింది. 
 
అప్పుడు ఒంటరిగా ఉన్న యజమాని చక్రవర్తి పాపపై అఘాయిత్యం చేయబోయాడు. బాలిక అరవకుండా నోరు మూసాడు. ఆ సమయంలో తల్లి పాపను వెతుక్కుంటూ పైకి వచ్చింది. విషయం గమనించిన తల్లి అతడిని చితకబాదింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చక్రవర్తిని అరెస్ట్ చేసారు. అతనిపై నిర్భయ, అట్రాసిటీ, అత్యాచార యత్నం చట్టాల కింద కేసులు నమోదు చేశారు.