శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (12:49 IST)

నేదురుమల్లి కాన్వాయ్‌పైపై దాడి కేసులో మావోయిస్టుకి రిమాండ్!

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వర రావుకు మేజిస్ట్రేట్ రిమాండ్‌కు తరలించారు. దీంతో దీపక్ను నెల్లూరు పోలీసులు స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. ఓ కేసులో నిందితుడిగా కోల్కతా జైల్లో ఉన్న దీపక్ను పీటీ వారెంట్పై పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు.  
 
2007 సెప్టెంబర్ నెలలో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ అందజేసే డాక్టరేట్ అందుకునేందుకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఆయన భార్య అప్పటి మంత్రి ఎన్.రాజ్యలక్ష్మి తమ కాన్వాయిలో ఇంటి నుంచి బయలుదేరగా, వాకాడు సమీపంలో ఆయన కాన్వాయ్‌పై మావోయిస్టులు మందుపాతరతో పేల్చిన విషయం తెల్సిందే. ఈ పేలుడులో కారు డ్రైవర్తోపాటు మరో ఇద్దరు మరణించారు. మరికొంతమంది గాయపడగా, నేదరుమల్లి దంపతులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.