శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , బుధవారం, 27 అక్టోబరు 2021 (15:46 IST)

విజయవాడ ఆదాయపు పన్ను కమీషనర్‌గా మేక‌తోటి ద‌యాసాగ‌ర్

విజయవాడ ఆదాయపు పన్ను కమీషనర్ గా మేక‌తోటి ద‌యాసాగ‌ర్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న ఆదాయ‌పు ప‌న్ను టి.డి.ఎస్. విభాగాన్ని ప‌ర్య‌వేక్షిస్తారు. 1992 ఐ.ఆర్.ఎస్. బ్యాచ్ కు చెందిన దయాసాగర్ ఏపీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కు భ‌ర్త‌. ఆయ‌న గతంలో ముంబై, హైదరాబాద్ లలో ఇన్కమ్ టాక్స్ కమీషనర్ గా పని చేశారు. 

 
విజయవాడ ఆదాయపు పన్ను కమీషనర్ గా మేక‌తోటి ద‌యాసాగ‌ర్ నేడు విజయవాడలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, కార్యాలయ సిబ్బంది  ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో విజయవాడ జెసిటిఐ, వినోద్ కన్నన్, విశాఖపట్నం జెసిటిఐ, శంకర్, విశాఖపట్నం డిసిటిఐ చింతపల్లి మెహర్ చాంద్, విజయవాడ ఐటిఓ. దుర్గాభవాని లు మేకతోటి దయాసాగర్‌కు ఘనస్వాగతం పలికారు.


ఆదాయపు పన్ను కమీషనర్(టి.డి.స్)గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిధి అంతటా ప్రభుత్వ ప్రాధాన్యతలైన టి. డి. యస్, పన్నుదారుల సేవలు, ఫిర్యాదు రహిత  పరిపాలనలే ధ్యేయంగా మెరుగైన సేవలు అందిస్తామని మేకతోటి దయాసాగర్ స్పష్టం చేశారు.