శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (15:57 IST)

తిరుపతిలో కామపిశాచి.. ఏం చేశాడో తెలుసా..?

నేటికి ఆడవారికి ఇంటా బయటా వేధింపులు తప్పడం లేదు. గడపదాటి కాలు బయట పెట్టిందంటే చాలు కామపు చూపుల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. మహిళా అభ్యున్నతి అంటూ మహిళా ఆర్థిక సాధికారత అంటూ ప్రభుత్వం పెట్టిన పథకాలలోనే

నేటికి ఆడవారికి ఇంటా బయటా వేధింపులు తప్పడం లేదు. గడపదాటి కాలు బయట పెట్టిందంటే చాలు కామపు చూపుల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. మహిళా అభ్యున్నతి అంటూ మహిళా ఆర్థిక సాధికారత అంటూ ప్రభుత్వం పెట్టిన పథకాలలోనే కామపిశాచాలు మాటు వేస్తున్నాయి. రుణాల కోసం వెళ్ళే ఆడవారిని తమకు రుణం తీర్చుకోమంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని చంపుకోలేక అలాగని అధికారులను బెదిరించలేక నరకయాతనను అనుభవిస్తున్నారు స్వయం శక్తి సంఘాల మహిళలు. మెప్మాలో తిష్టవేసిన కొంతమంది కామాంధుల కారణంగా ఆ పథకంలో చేరాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు. ఇలా వేధింపులు ఎదుర్కొంటున్న నలుగురు మహిళలు తమకు జరిగిన అన్యాయం పట్ల న్యాయం చేయమంటూ మీడియాను ఆశ్రయించారు. 
 
అమాయకానికి నిలువెత్తు రూపం మెప్మా అధికారి జయరామ్. తిరుపతిలోని స్వయం శక్తి సంఘాలకు ఇతను కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని కింద కొన్ని వందల మంది మహిళలు మహిళా గ్రూపులుగా ఏర్పడి రుణాలు తీసుకుంటూ ఉంటారు. వారందరి రుణాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించడం ఇతని బాధ్యత. అయితే తనకు అధికారం ఉందన్న దర్పమో.. లేక తన మాట ఎందుకు కాదంటారేమోనన్న నమ్మకమో ఒక నీచపు ఆలోచనకు తెరతీశారు. అమాయక చూపులతో వేధించడం మొదలుపెట్టిన జయరాం తరువాత తన చేష్టలకు పనిచెప్పాడు. 
 
ఏకంగా తనకు లొంగిపోవాలంటూ అయిదు మంది స్వయంశక్తి సంఘాల గ్రూపు లీడర్లను వేధించడం మొదలుపెట్టాడు. వారి గ్రూపులో ఉన్న మహిళల తీసుకున్న రుణాలను చెల్లించే కంతులను పర్యవేక్షించే బాధ్యతల్లో ఉన్న మహిళలు జయరాం తీరును తీవ్రంగా ఖండించారు. ఇది సరైన పద్థతి కాదంటూ అనేక సార్లు మందలించారు కూడా. అలా మందలించిన ప్రతిసారి జయరాం తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. తాను సంతకం పెట్టకపోతే మీకు రుణాలే రావంటూ బెదిరింపులకు దిగాడు. ఇంత మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ గ్రూపు లీడర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు జయరాం ఆగడాలు రోజురోజుకు మితిమీరుతుండడంతో ఇక లాభం లేదనుకున్న ఆ మహిళలు  మీడియాను ఆశ్రయించారు. 
 
ఇంతకాలంగా ఆ అధికారి తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఈ స్వయం శక్తి సంఘాలు అనేకమంది నాయకులను, ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రి అమరనాథ రెడ్డికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కరు జయరాంపై చర్యలు తీసుకున్న పాపానపోలేదు. అసలు ఒక కిందిస్థాయి ఉద్యోగిగా ఉంటూ జయరాం ఇలా వెకిలి చేష్టలు చేయడానికి కారణమేంటి. ఎవరతనికి అండదండలు అందిస్తున్నారన్న విషయాన్ని మీడియా ఆరాతీసింది. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్ మద్దతు జయరాంకు పుష్కలంగా ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే అల్లుడి అండదండలు చూసుకుని తనను ఎవరూ ఇక్కడి నుంచి బదిలీ చేయలేరన్న ధీమాతో ఆడవారి పట్ల అసహ్యంగా ప్రవర్తించడానికి సిద్ధమయ్యారు. 
 
ఇన్ని ప్రత్యక్ష ఆరోపణలు తనపై వస్తున్నా తాను మాత్రం ఉత్త శుద్ధపూసనంటూ చెప్పుకొచ్చాడు జయరాం. తనకు మహిళలంటే అమితమైన గౌరవమని పూర్తిగా మహిళలతో ముడిపడి ఉన్న విభాగంలో పనిచేయడం వల్ల వారి పట్ల అత్యంత గౌరవంగా మెలుగుతానని, వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా అన్ని విధాలుగా సహకరిస్తానంటూ కల్లబొల్లిమాటలు చెప్పుకొచ్చాడు. చివరకు ఆ మహిళలు చేస్తున్న ఫిర్యాదు పట్ల ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదంటూనే తెల్లమొఖమేశాడు జయరాం. ఇలాంటి కామ ఆఫీసర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.