మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (17:03 IST)

టీడీపీ సానుభూతిపరుడుగా పవన్ కళ్యాణ్ : మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

kakani
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇపుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా మారిపోయారంటూ ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. రైతుల్లా నటించేవారి గురించి మాట్లాడటం వృథా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు మంత్రి కాకాణి ఘాటుగానే కౌంటరిచ్చారు. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా పవన్ మారిపోయి ఏవేవో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 
 
అంతకుముందు పవన్ వైకాపా సర్కారును ఏకిపారేశారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలను పెట్టుబడిసాయంగా ఇస్తామని చెప్పిన హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని రైతు కుటుంబాలకు రూ.50 వేలు పెట్టుబడి సాయం అందించారంటూ ఆయన నిలదీశారు. రైతులు నుంచి కొనుగోలు చేసిన పంటలకు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని పవన్ ఆరోపించిన విషయం తెల్సిందే.