సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (15:42 IST)

మన్యం వీరుడి మహోత్సవంలో మధురానుభూతిని పొందాను : ఆర్కే రోజా

roja selfie
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే. రోజా సందడి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన ఈ కార్యక్రమంలో రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ వేడుకలో పాల్గొని అందరిని దృష్టిని ఆకర్షించారు.
 
ముఖ్యంగా, ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్‌లతో కలిసి రోజా ఓ సెల్ఫీ తీసురున్నారు. ఈ సందర్భంగా తన సెల్ఫీలో మోడీ జగన్ చిత్రాలను విస్పష్టంగా కనిపించేలా ఆమె తన సెల్ యాంగిల్స్‌ను మారుస్తూ కనిపించారు. 
 
ఈ వీడియోను ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పనిలోపనిగా ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవితోనూ రోజా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్పీలన్నింటినీ రోజా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ మన్యం వీరుడి విగ్రహావిష్కరణ మహోత్సవం మధురానుభూతిని మిగిల్చిందని కామెంట్ చేశారు.