ప్రజలను ఇబ్బంది పెడితే చంద్రబాబును సైతం అరెస్ట్ చేస్తాం
విజయవాడలో వైసిపి నిరసన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానిక
పంజాసెంటర్ లో చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొడుతూ, వినూత్న రీతిలో నిరసన తెలిపిన వైసిపి శ్రేణులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా? చంద్రబాబు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో? అందరికీ తెలుసని మంత్రి ఎద్దేవా చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రభుత్వం కూలిపోవాలని చంద్రబాబు విషం కక్కుతూనే ఉన్నారు. పట్టాభి మాటలను ఎవరైనా సమర్ధిస్తారా? చంద్రబాబు నువ్వు, లోకేష్ సమర్ధిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సైగ చేస్తే, రాష్ట్రంలో ఒక్క టిడిపి నేత తిరగలేడని, చెండాలపు మాటలు మాడ్లాడితే పడాలా? హైద్రాబాద్ లో చంద్రబాబుకి ఇంద్రా ప్యాలెస్ లేదా? చంద్రబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ ఉన్నాడని అనుకుంటున్నారేమో? ఆయన ఉన్నా లేనట్లే అని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు ఆశాంతి సృష్టించాలని చూస్తున్నారని, వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తే, చంద్రబాబు, అతని తాబేదారులు తట్టుకోలేరని అన్నారు. గంజాయికి పేటెంట్ హక్కు ఉంది చంద్రబాబుకే అని, అక్రమ మద్యం, సారాయిని ఉక్కు పాదంతో సిఎం జగన్ అణచి వేష్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పై చంద్రబాబు కాని, అతని అడవి పందులు కాని మాట్లాడితే? ఖబడ్దార్ అని హెచ్చరించారు.
చంద్రబాబు బందుకు పిలుపునిస్తే సహకరించాలా? చంద్రబాబు ఒక నీచుడు. ప్రజలను ఇబ్బంది పెడితే చంద్రబాబు ను సైతం అరెస్ట్ చేస్తాం...మా డిజిపిని ఏం చేస్తావ్?..డిజిపి గేటును కూడా తాకలేవు అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు.