శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 13 ఏప్రియల్ 2017 (09:04 IST)

రూ. 5ల భోజనం పరిశీలనకు వచ్చాడు.. కౌంటర్లో తిన్నాడు.. ఎమ్మెల్యేలు ఇలా కూడా ఉంటారా?

అసెంబ్లీ సభ్యుడి స్థాయి కలిగిన ఒక ప్రజా ప్రతినిధి ఒక పథకం పొరుగు రాష్ట్రంలో ఎలా అమలవుతోందో తెలుసుకోవడానికి మందిమార్బలం లేకుండా.. ఆట్టహాసాలు ప్రదర్సించకుండా నేరుగా ఆ చోటుకు వచ్చి హెల్మెట్ చేతిలో పెట్టుకుని మరీ చౌక భోజనం నిలబడి ఆరగించి వెళ్లడం జరుగుతుం

అసెంబ్లీ సభ్యుడి స్థాయి కలిగిన ఒక ప్రజా ప్రతినిధి ఒక పథకం పొరుగు రాష్ట్రంలో ఎలా అమలవుతోందో తెలుసుకోవడానికి మందిమార్బలం లేకుండా.. ఆట్టహాసాలు ప్రదర్సించకుండా నేరుగా ఆ చోటుకు వచ్చి హెల్మెట్ చేతిలో పెట్టుకుని మరీ చౌక భోజనం నిలబడి ఆరగించి వెళ్లడం జరుగుతుందని ఎవరైనా కలగన్నారా.. కానీ హైదరాబాద్ దానికి వేదికైంది.
 
తేదీ: బుధవారం.. సమయం:  మధ్యాహ్నం. స్థలం: హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న హరేకృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న రూ.5ల భోజన కేంద్రం. ఘటన: ఒక ఎమ్మెల్యే అప్పుడే బైక్ మీద వచ్చి చేతిలో హెల్మెట్‌తో క్యూలో నిలబడి, టోకెన్ తీసుకుని, కౌంటర్లో వారందించిన భోజనం చేయడం.
 
ఆయన ఏ పార్టీ వారయినా కావచ్చు. కానీ, తెలంగాణలో అమలవుతున్న రూ.5ల భోజన కేంద్రం (అన్నపూర్ణ) పథకం ఎలా అమలవుతోంది అనే విషయం తెలుసుకోవడానికి ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చి స్వయంగా ఆ భోజన కేంద్రాన్ని సందర్శించడంలో ఆయన చూపిన నిరాడంబరత్వం రాజకీయ నేతలందరికీ ఆదర్శం కావాలి. ఇలాంటి పథకాన్ని తన నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. అందుకే రూ. 5 భోజనం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇలా వచ్చానని బదులిచ్చారు.
 
ఇంతకీ ఆయన ఎవరంటే మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). ముందే చెప్పినట్లు ఏ పార్టీ నేత అన్నది ముఖ్యం కాదు. తన మనసులో నాటుకున్న ఒక అంశాన్ని పరిశీలించడానికి బైక్ మీద వచ్చి నిలబడి భోజనం చేసిన సాధారణ దృశ్యాన్ని ఎవరు ప్రదర్శిస్తే మాత్రం ఏమిటి? మనిషిని, పార్టీని మించిన ఆదర్శం కదా ఇక్కడ ముఖ్యం.