ఇక టీడీపీకి పార్టీకి తిరుగులేదు: ఎమ్మెల్యే బాలకృష్ణ  
                                          నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. భూమా బ్రహ్మానందరెడ్డికి అభినంద
                                       
                  
                  				  నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. భూమా బ్రహ్మానందరెడ్డికి అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన చేశారు. 
				  											
																													
									  
	 
	అభివృద్ధి కోసం కృషి చేస్తోన్న తమ పార్టీకి ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఈ విజయంతో మరోసారి స్పష్టమైందని పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీడీపీ శ్రేణులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. 
				  
	 
	ఈ ఎన్నిక ఫలితంలో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నట్టు స్పష్టమైందన్నారు. అందువల్ల మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.