గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (19:25 IST)

నంద్యాల ఫలితం తర్వాత రోజా పోస్ట్ ఇదీ... అన్నన్నా అదేం పదమమ్మా...!!

నంద్యాల ఉప ఎన్నికల ఫలితం తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియా ముందు కనిపించలేదు కానీ ఫేస్‌బుక్‌లో తన స్పందన తెలియజేశారు. ఆమె పోస్టు ఇలా సాగింది... గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా...

నంద్యాల ఉప ఎన్నికల ఫలితం తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియా ముందు కనిపించలేదు కానీ ఫేస్‌బుక్‌లో తన స్పందన తెలియజేశారు. ఆమె పోస్టు ఇలా సాగింది...
గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా...
" నాన్న ఆశయాలే శ్వాసగా బతికావు(తేడా కొడుతోంది రోజమ్మా...)
నాన్నపై కుట్రలను సహించక దేశాన్ని శాసించే నియంత మెడలు వంచి,
నమ్ముకున్న మాకోసం దమ్మున్న నాయకుడిగా నాన్న పేరుతో పార్టీ పెట్టావు, 
దొంగ హామీలు ఇవ్వలేదు, కుల రాజకీయాలు చేయలేదు, వేరొకరి ప్రభతో వెలగాలనుకోలేదు, 
సింహంలా సింగిల్‌గా నిలిచావు, ప్రతి నిమిషం ప్రజల కోసం పోరాటం చేస్తున్నావు,
జగనన్నా, నీ వెంట మేముంటాము... ఈ పోరాటంలో మేము సైనికులమవుతాము.
ఆఖరి శ్వాస వరకూ జై జగన్ అంటూనే ఉంటా."