గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 1 డిశెంబరు 2021 (20:35 IST)

చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నా... ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ

గ‌న్న‌వ‌రంఎమ్మెల్యే, టీడీపీ రెబ‌ల్ వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్  చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిని బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ కోరారు. తాను భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశాన‌ని, చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నా అని చెప్పారు. 
 
ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవం ...నా వ్యాఖ్యలకు నేను బాధపడుతున్నా ...టీడీపీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి ...భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా ...కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదు.. నేను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నా ... చంద్రబాబును కూడా క్షమాపణ కోరుతున్నా అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివ‌ర‌ణ ఇచ్చారు.