Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దాసరి మరణం జీర్ణించుకోలేకపోతున్నా: భోరున విలపించిన మోహన్‌ బాబు

హైదరాబాద్, బుధవారం, 31 మే 2017 (03:31 IST)

Widgets Magazine
mohan babu

తనకు నటుడిగా జీవితానిచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు అన్నారు. కిమ్స్‌ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ మాట్లాడిన మోహన్‌బాబు ‘నాకు నటుడిగా గుర్తింపునిచ్చిన మహనీయుడు దాసరి. దాసరి ఆత్మకు శాంతి చేకూర్చాలని  సాక్షిగా కోరుకుంటున్నాను’ అని చెప్పారు. దాసరి నారాయణరావు మృతితో  తెలుగు చిత్ర పరిశ్రమలో మూలస్థంభాన్ని కోల్పోయామని నటుడు మోహన్‌ బాబు అన్నారు. 
 
దాసరి లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా మీడియా ఎదుట భోరున విలపించారు.  దాసరి తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడని, నటనలో తనకు ఓనమాలు నేర్పిన గురువు అని చెప్పుకొచ్చారు. తనకు నటుడిగా గుర్తింపునిచ్చిన దాసరి గారి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సాయినాధుని సాక్షిగా కోరుకొంటున్నాని మోహన్‌ బాబు అన్నారు. తనకు నటుడుగా దాసరి జన్మినిచ్చారన్నారు. నటుడిగా తనకో జీవితాన్ని ప్రసాదించారని తెలిపారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
దాసరి నారాయణరావు దాసరి కన్నుమూత మోహన్‌ బాబు Mohan Babu Dasari Narayanarao Dasari Passed Away

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలి: మండలి బుద్ధప్రసాద్

అమరావతి : తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ.. ...

news

విశాఖ భూదందాపై ఉక్కుపాదం... కేఈ క్రిష్ణమూర్తి

విశాఖ భూ దందాపై బహిరంగ విచారణ చేపడతామన్నారు ఉప ముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. విశాఖ ...

news

నారా లోకేశ్ మైక్ పట్టుకుంటే.. చంద్రబాబు మొహంలో టెన్షన్ కనిపించింది: అంబటి

వైకాపా నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మంత్రిగా ప్రమోట్ అయిన నారా లోకేష్‌కు సరిగ్గా ...

news

ఉన్ ఓ పిచ్చోడు.. ఉ.కొరియాపై అణు దాడి చేద్దాం.. అమెరికా - ద.కొరియా కసరత్తు

ఉత్తర కొరియా పనిబట్టేందుకు అమెరికా, దాని మిత్రదేశం దక్షిణ కొరియా సిద్ధమయ్యాయి. ప్రపంచ ...

Widgets Magazine