బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 12 ఆగస్టు 2017 (18:04 IST)

మోహన్ బాబు పొలిటికల్ సెకండ్ ఇన్సింగ్స్... ఇప్పటి రాజకీయాలు సరిపడతాయా?

కాంట్రవర్సి యాక్టర్ మోహన్ బాబు త్వరలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా.. మరోసారి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరిశీలించుకుంటారా. ఎవరినైనా తన మాటల తూటాలతో ముఖం మీదే చెప్పేసే కలెక్షన్ కింగ్ ప్రస్తుత రాజకీయాలకు సూటవుతారా.. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారు.

కాంట్రవర్సి యాక్టర్ మోహన్ బాబు త్వరలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా.. మరోసారి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరిశీలించుకుంటారా. ఎవరినైనా తన మాటల తూటాలతో ముఖం మీదే చెప్పేసే కలెక్షన్ కింగ్ ప్రస్తుత రాజకీయాలకు సూటవుతారా.. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారు. దివంగత నేత ఎన్.టి.రామారావుతో ఉన్న అనుబంధంతో ఆయన పెట్టిన టిడిపిలోకి వెళతారా లేక రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న బంధుత్వంతో జగన్ పార్టీలో చేరుతారా.. మోహన్ బాబు సెకండ్ ఇన్సింగ్స్ ఎటువైపు...
 
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముక్కుసూటితనంతో మాట్లాడే వ్యక్తి. తనకు నచ్చకుంటే ఏ పనైనా చేయ్యనీరు.. ఎంతటి వారైనా లెక్కచేయరు. సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు మోహన్ బాబుకు ఉంది. దివంగత నేత ఎన్.టి.రామారావుతో తనకున్న పరిచయంతో రాజకీయాల్లోకి వచ్చిన మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేని మోహన్ బాబు ఆ తరువాత రాజకీయాలకు దూరమైపోయారు. తన సొంత విద్యాసంస్థలవైపే ఎక్కువగా దృష్టి పెట్టారు. అడపాదడపా అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నారు. అయితే గత కొన్నినెలలుగా మోహన్ బాబు రాజకీయవైపు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు ఏదో ఒక పార్టీలో చేరాలన్న నిర్ణయంలో ఉన్నారు మోహన్ బాబు. 
 
అందుకే ప్రయత్నాలు ప్రారంభించారు. బోగి పండుగ రోజు చిత్తూరు జిల్లా నారావారిపల్లికి వచ్చిన చంద్రబాబును కలిశారు మోహన్ బాబు. ఆ తరువాత హైదరాబాదులో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మోహన్ బాబు పార్టీలోకి వస్తానంటే ఎవరైనా సరే ఒప్పుకుంటారు. రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తారు. అదే నమ్మకంతో మోహన్ బాబు ఉన్నారు. తన కుటుంబం మొత్తం ఈమధ్య కాలంలో జగన్‌కు అత్యంత సన్నిహితులయ్యారు. మంచు విష్ణు, మంచు మనోజ్‌తో పాటు మంచు లక్ష్మిలు జగన్‌తో బాగా కలిసిపోయారు. అందులోను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఆయన కుటుంబం అంటే మోహన్ బాబుకు ఎంతో గౌరవం. అందుకే మోహన్ బాబు వైఎస్ఆర్సిపిలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే మోహన్ బాబు వైసిపిలో చేరడం ఖాయమని ఆయన సన్నిహితులే చెప్పుకుంటున్నారు.