రాత్రికి పెళ్లి చూపులు.. అడవిలో పెళ్లి కుమార్తె... ప్రయాణికులకు మార్నింగ్ 'స్టార్స్'

శనివారం, 12 ఆగస్టు 2017 (11:49 IST)

morning star bus

రాత్రికి పెళ్లి చూపులు... అడవిలో పెళ్లి కుమార్తె. ఇదీ ఓ యువతి ఎదుర్కొన్న కష్టం. ఈ కష్టం ఎవరి వల్ల వచ్చిందో తెలుసా.. ఓ ప్రైవేట్ బస్సు ఆపరేటర్. ఆ బస్సు ఆపరేటర్ పేరు మార్నింగ్ స్టార్. ఈ బస్సు ఎక్కిన పాపానికి ప్రయాణికులకు నిజంగానే చుక్కలు చూపించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో బస్సును ఆపేశారు.. దీంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శుక్రవారం రాత్రి బెంగళూరులో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ 'మార్నింగ్ స్టార్'కు చెందిన బస్సు, తెల్లవార్లూ ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఆర్టీయే అధికారుల తనిఖీల భయంతో దాదాపు ఏడు గంటల పాటు బెంగళూరు చుట్టూ తిరిగి తెల్లారేసరికి హోస్పేట్ సమీపానికి బస్సు చేరుకుని నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలోనూ బస్సు అక్కడే ఉంది.
 
ఈ బస్సు నిర్వాహకుల తీరుపై ఓ యువతి మాట్లాడుతూ తనకు నేడు (శనివారం) పెళ్లి చూపులని, రాత్రి బస్సెక్కితే, ఇప్పటికీ హైదరాబాద్‌కు చేరకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వాపోయింది. ఇక ఇద్దరు చిన్న పిల్లలతో బస్సెక్కిన మరో మహిళ, తమను ట్రావెల్స్ సంస్థ మోసం చేసిందని, అనుమతులు లేని బస్సును నడుపుతూ, రాత్రంతా ప్రయాణించినా, 100 కిలోమీటర్ల దూరం కూడా తీసుకు రాలేదని, ఇక ఇప్పుడు బస్సు బయలుదేరినా హైదరాబాద్ చేరేసరికి ఏ అర్థరాత్రి అవుతుందోనని చెప్పింది. దీనిపై మరింత చదవండి :  
Passengers Suffer Hospet Bangalore Morning Star Bus Hyderabad Bus Service

Loading comments ...

తెలుగు వార్తలు

news

మతం మార్చుకుంటేనే కోడలితో కాపురమన్న తల్లి.. సరేనంటూ తలూపిన కొడుకు... ఎక్కడ?

ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కోడలికి అత్త వైపు నుంచి వేధింపులు మొదలయ్యాయి. కోడలు ...

news

జయలలిత వేలిముద్ర ఇష్యూ- లక్కానీకి సమన్లు.. అపోలో వ్యవహారం బయటపడుతుందా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్ర వ్యవహారంలో ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లక్కానీకి ...

news

యూపీలో ఘోరం.. ఆక్సిజన్ అందక 30 మంది పసికందుల మృతి.. సీఎం అత్యవసర భేటీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక 30 మంది ...

news

హైదరాబాద్ వీధుల్లో కోటీశ్వర 'బిచ్చగాడు' అజ్ఞాతవాసం! ఎందుకు?

మహాభారతంలో పంచపాండవులు జూదంలో ఓడిపోయి అజ్ఞాతవాసం గడుపుతారు. అలాగే, 'బిచ్చగాడు' చిత్రంలో ...