గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (15:37 IST)

కుటుంబ కలహాలు.. కన్నబిడ్డను కడతేర్చిన తల్లి

కన్నబిడ్డ పట్ల ఓ తల్లి కిరాతకురాలిగా మారింది. నవమాసాలు మోసి కని పెంచుకున్న ఓ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి కాటికి పంపింది ఓ తల్లి. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని రుద్రవరంలో వెలుగు చూసింది. మౌనిక అనే వివాహిత తన రెండేళ్ల కుమారుడి గొంతు కోసి చంపింది. ఆ తర్వాత ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 
 
బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మౌనిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడడానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.