శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (15:34 IST)

బీజేపీ, వైకాపాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: గల్లా జయదేవ్ ఫైర్

బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. పనిలో పనిగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు గల్లా జయదేవ్ ప్రశ్నాస్త్రాలు సం

బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. పనిలో పనిగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు గల్లా జయదేవ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి లోక్ సభ సభ్యులుగా ఉన్న బీఎస్ యడ్యూరప్ప, బి శ్రీరాములు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో వారు లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. వాటిని స్పీకర్ వెంటనే ఆమోదించారు. 
 
కానీ వీరి కంటే ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ రాజీనామాలు సమర్పించారు. కానీ, వాటిపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదేం న్యాయమంటూ స్పీకర్‌ను అడిగారు.
 
అవిశ్వాస తీర్మానంపై ఢిల్లీలో డ్రామా తర్వాత రాజీనామాల డ్రామా కూడా అనుకున్నట్టుగానే కొనసాగుతోందని గల్లా జయదేవ్ సెటైర్లు విసిరారు. వైకాపా ఎంపీలు నిజంగానే అభ్యర్థించి వుంటే వారి రాజీనామాలను ఎందుకు ఆమోదించలేదని గల్లా జయదేవ్ పోస్టు పెట్టారు.