శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (11:59 IST)

ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు - వైకాపా బోణీ

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. నెల్లూరు జిల్లా కొవ్వూరులో తొలి ఫలితం వెలువడింది. ఆ ప్రాంతంలో వైసీపీ బోణీ కొట్టింది. ఆమంచర్ల ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి 760 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 
 
సౌత్‌ మోపూరు స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. కొవ్వూరులోని బ్రహ్మయ్య ఇంజనీరింగ్ కాలేజీలో కొవ్వూరు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన ఓట్లు లెక్కిస్తున్నారు. సాయంత్రం 4 గంటలలోపు కౌంటింగ్‌ పూర్తి కానుంది. 
 
ఇత‌ర ప్రాంతాల్లోనూ ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. క‌రోనా నేపథ్యంలో ర్యాలీలు, విజయోత్సవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
 
అలాగే చిత్తూరు జిల్లాలో బుగ్గపట్నం ఎంపీటీసీ 1573 ఓట్లతో వైకాపా గెలుపు, పాతవెంకటాపురం ఎంపీటీసీ 616 ఓట్లతో వైకాపా గెలుపు. వైయస్ఆర్ జిల్లాలో ఊటుకూరు-2 ఎంపీటీసీ 882 ఓట్లతో వైకాపా గెలుపు. కృష్ణా జిల్లాలో అక్కపాలెం ఎంపీటీసీ 372 ఓట్లతో వైకాపా గెలుపు ప్రకాశం జిల్లాలో సంతమాగులూరు -1 ఎంపీటీసీ 1645 ఓట్లతో వైకాపా గెలుపు.