మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (14:25 IST)

పవన్‌ను తన్ని తరిమేస్తానన్న ముద్రగడ... ఖండించిన కుమార్తె.. వాడుకుని వదిలేస్తారంటూ హితవు

kranthi
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌ను తన్ని తరిమేస్తామంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి తీవ్రంగా ఖండించారు. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని, ఆయన మాటలు ఏమాత్రం సరికాదని, పవన్‌తో పాటు ఆయన అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు.
 
"అందరికీ నమస్కారం. నేను క్రాంతి. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో వపన్ కల్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్‌ను ఓడించి... పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానుకు కూడా నచ్చలేదు.
 
వంగా గీతని గెలిపించడానికి కష్టపడొచ్చు. కానీ పవన్ కల్యాణ్‌గారని, ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. కేవలం పవన్ కల్యాణ్‌గారిని తిట్టడానికే మా నాన్నగారిని జగన్ వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పవన్ కల్యాణ్‌గారి గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా" అని ఆమె వీడియో ద్వారా వెల్లడించారు.