శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 21 మే 2015 (19:27 IST)

రాజధానిపై పర్యాటక శాఖ కన్ను... మల్టీప్లెక్సుల నిర్మాణానికి ప్రణాళికలు

రాజధాని నిర్మాణ పనుల్లో ప్రభుత్వం బిజీబిజీగా గడుపుతోంది. మరోవైపు పర్యాటక శాఖ అధికారులు తమ పనిలో తాము మునిగిపోయారు. అక్కడ మల్టీప్లెక్సుల నిర్మాణం ద్వారా పర్యాటకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో రకరకాల ప్రాజెక్టులను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెస్టారెంట్‌లు, ఫుడ్‌కోర్టులు, మల్టీస్టోర్డ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, ప్లేపార్కు నిర్మిస్తారు. లోపల సువిశాలమైన రోడ్లు, పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చే స్తారు. 50 ఎకరాల స్థలం ప్రాజెక్టుకు అవసరం అవుతుందని అంచనా వేసిన అధికారులు స్థలాన్ని అన్వేషణ చేయాల్సిందిగా జిల్లాలోని ఆర్‌డీవోలకు లేఖలు రాశారు. స్థలాన్ని రెవెన్యూ శాఖ గుర్తిస్తే పీపీపీ పద్ధతిలో మల్టీప్లెక్స్‌ నిర్మాణాన్ని చేపడతామని చెబుతున్నారు. 
 
హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డుకు సమీపంలో ఉండే ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌ విశేష గుర్తింపు పొందింది. ఆ తర్వాత విజయవాడ, వైజాగ్‌లోనూ వీటిని నిర్మించారు. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని గుంటూరులో నిర్మాణం జరగనున్న నేపథ్యంలో మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను ఇక్కడ నిర్మించేందుకు పర్యాటక శాఖ ఆసక్తి చూపుతోంది. మల్టీప్లెక్స్‌ థియేటర్‌ వినోదాన్ని పంచే ఆహ్లాదకరమైన ప్రాంగణం. ఇంచుమించు 50 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం చేపడతారు. భారీ తెరతో సుమారు 2,000మంది కూర్చునేలా థియేటర్‌ని నిర్మిస్తారు. దీంతోపాటు మరో నాలుగు సినిమా థియేటర్లను కూడా ప్రాంగణంలో ఏర్పాటుచేస్తారు. రెస్టారెంట్‌లు, ఫుడ్‌కోర్టులు, మల్టీస్టోర్డ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, ప్లేపార్కు నిర్మిస్తారు. లోపల సువిశాలమైన రోడ్లు, పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చే స్తారు. ఆహ్లాదం, వినోదాన్ని కోరుకొనేవారు రోజంతా మల్టీప్లెక్స్‌లో ఆస్వాదించవచ్చు.
 
హైదరాబాద్‌లో ఉన్న ఐమాక్స్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. 24 గంటలు ఇది తెరిచే ఉంటుంది. అర్ధరాత్రి వేళల్లో కూడా మల్టీప్లెక్స్‌ షోలు ప్రదర్శిస్తుంటారు. నైట్‌ డ్యూటీ చేసి అర్ధరాతి రెండు, మూడు గంటలకు డ్యూటీ దిగిపోయే కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, కార్పొరేట్‌ సెక్టార్‌ ఉద్యోగుల నుంచి దీనికి ఆదరణ ఉన్నది. రాజధాని నేపథ్యంలో ఇప్పటికే గుంటూరులో మెట్రో సంస్కృతి వచ్చేస్తోంది. ఇంచుమించు అన్ని సినిమా థియేటర్లను ఎయిర్‌ కండీషనింగ్‌గా మార్చేశారు. ఇలా అత్యాధునిక నగరజీవనాన్ని రాజధాని నిర్మాణంతోపాటు తీసుకురావాలని పర్యాటక శాఖ యోచిస్తోంది.