శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (15:28 IST)

నాగబాబు ట్వీట్.. నెటిజన్లు ఫన్నీగా సైటెర్లు..

అమరావతి రాజధానిపై జరుగుతున్న గందరగోళంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఏపీ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని పరోక్షంగా తెలిపారు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఏపీ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారంటూ నాగబాబు ట్వీట్ చేశారు. 
 
ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో గుర్తించిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అమరావతి రాజధానిపై జరుగుతోన్న గందరగోళంపై స్పందిస్తూ ఆయన ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇంకా వైసీపీ అభిమాని ఒకరు స్పందిస్తూ.. వారిలో ఒకరు చంద్రబాబు మరొకరు పవన్ కల్యాణ్.. అంతేగా? నాగబాబు గారూ' అంటూ సెటైర్ వేస్తూ రిప్లై ఇచ్చాడు. నాగబాబు కామెంట్ 'అదిరింది' అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆయన 'అదిరింది' అనే కామెడీ షోలో పాల్గొంటోన్న సంగతి తెలిసిందే.