నగరిలో రోజాకే మళ్లీ పట్టం.. తేల్చేసిన లగడపాటి ఆర్జీ ఫ్లాష్ టీమ్

జాతీయవ్యాప్తంగా పేరుపొందిన లగడపాటి నేతృత్వంలోని ఆర్జీఫ్లాష్‌ టీం 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నగరిని సర్వే కోసం ఎంపిక చేశారు. శాస్త్రీయంగా జర

RK Roja
selvi| Last Updated: ఆదివారం, 17 జూన్ 2018 (12:59 IST)
జాతీయవ్యాప్తంగా పేరుపొందిన లగడపాటి నేతృత్వంలోని ఆర్జీఫ్లాష్‌ టీం 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నగరిని సర్వే కోసం ఎంపిక చేశారు. శాస్త్రీయంగా జరిగిన సర్వేలో సినీనటి ఆర్‌కె రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైసీపీకే స్వల్ప మెజారిటీ లభించేలా వుంది.


అయితే 2014 ఎన్నికల ఫలితాలకూ, ప్రస్తుత సర్వే ఫలితాలకూ పెద్దగా తేడా లేదు. ఇరు పార్టీ నడుమా స్వల్ప తేడా మాత్రమే ఇప్పటికీ ఉంది. నువ్వానేనా అన్నంత పోటాపోటీగానే నగరిలో ఇరుపార్టీలు ఉన్నట్టు సర్వే ఫలితాలను బట్టి అర్థమవుతోంది. 
 
ఇక చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని, నగరి ప్రజలు నరేంద్ర మోదీపై పెంచుకున్న కోపం, తెలుగుదేశం పార్టీకి విఘాతంగా మారిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం సర్వే నిర్వహించిన లగడపాటి నేతృత్వంలోని ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేర్కొంది. ప్రస్తుతం నటి రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో స్వల్ప మెజారిటీతోనైనా వైకాపా గెలుస్తుందని సర్వే చేసిన టీమ్ తేల్చింది. కాగా, 2014 ఎన్నికల్లో రోజా చేతిలో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గతేడాది మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
ఇకపోతే, ప్రత్యేక హోదా కోసం వైసీపీ బాగా పోరాడుతోందని నగరి ప్రజల్లో అభిప్రాయం ఉంది. టీడీపీతో పోలిస్తే వైసీపీకి ఈ అంశంలో 1.42 శాతం మంది ఆమోదం ఎక్కువగా లభించింది. ఈ విషయంలో 10.25 శాతం మంది జనసేనకు, 1.67 శాతం మంది కమ్యూనిస్టులకు, 2 శాతం మంది ప్రత్యేక హోదా సాధన సమితికి సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
 
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుపై నగరి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆయన పనితీరు బాగాలేదని 54.50 శాతం మంది చెప్పగా, బావుందని 45.50 శాతం మంది వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :